మృతి చెందిన మాజీ సైనిక ఉద్యోగి అవయవ దానం

మృతి చెందిన మాజీ సైనిక ఉద్యోగి అవయవ దానం
  • అవయవ దానం తో  మరికొందరి జీవితంలో వెలుగులు

ముద్ర.వనపర్తి :- తాను చనిపోయిన మరికొందరి జీవితాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో మృత్యుతో పోరాడుతున్న మాజీ సైనిక ఉద్యోగి తాను మరణించిన తర్వాత అవయవ దానం చేసి మరికొందరికి ఆయుష్షును పోశారు. వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పోలికపాడు గ్రామానికి చెందిన అంజయ్య ఆర్మీలో పని చేస్తూ దేశానికి సేవ చేస్తూ 2017 లో రిటైర్మెంట్ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రిటైర్మెంట్ తర్వాత  వనపర్తి లో కుటుంబంతో నివాసం ఉంటూ స్వగ్రామమైన పోలికపాడులో వ్యవసాయ పనులు చేసుకుంటే జీవనం సాగించేవాడని తెలిపారు. ఈనెల ఆరవ తేదీన ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు కావడంతో  సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఫలితం లేకపోవడంతో డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు, తాను లేకున్నా తన అవయవాలతో మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నా మృతుని అంజయ్య కోరిక మేరకు అవయవ దానం చేయడానికి అంజయ్య భార్య అలివేలమ్మ ఒప్పుకోవటంతో శుక్రవారం కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన అంజయ్య అవయవాలను దానం చేయటంతో, తాను మరణిస్తూ కూడా ఇతరులకు జీవితం ప్రసాదించిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అంజయ్య చిరస్మరణీయుడని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజలు కొనియాడారు. అంజయ్య 2017 లో పదవీ విరమణ పొందిన తర్వాత వ్యవసాయం చేస్తూ ఉత్తమ రైతుగా అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.