హైడ్రా, మూసీ పై విపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి

హైడ్రా, మూసీ పై విపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి
  • కార్పోరేషన్ ఛైర్మన్ ల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా, మూసి ప్రక్షాళన విషయంలో బీఆర్​ఎస్​, బీజేపీ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ పిలుపునిచ్చారు. ఇటీవల నియమితులైన వివిధ కార్పొరేషన్లతో మంగళవారం గాంధీభవన్​ లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అవిశ్రాంతంగా పని చేసిన మీరు కాంగ్రెస్​ పాలనలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కన్పిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం, మంత్రులు రోజుకు విశ్రాంతి లేకుండా 18 గంటలు పని చేస్తున్నారన్నారు. రోజు కు ఓక కొత్త స్కీం ను తీసుకొచ్చి ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని పీసీసీ చీఫ్​ సూచించారు. అందుకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకుని ప్రచారం చేయాలనీ, ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రమూ అంత పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదని ఆ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.ఇంకా దూకుడు గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 

తీర్మాణం..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే డీసీసీ అధ్యక్షులకు, ఫ్రంటల్ చైర్మన్ లకు, సీనియర్ నాయకులకు అందరిని గుర్తించి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సమావేశం  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.