యువత క్రీడల్లో రాణించాలి - పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

యువత క్రీడల్లో రాణించాలి  - పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

ముద్ర, షాద్ నగర్:చౌదరి గూడ మండలం వీరన్నపేట్ గ్రామ యువత క్రికెట్ టౌర్నమెంట్ పోటీలు నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  హాజరై ఆటను ప్రారంభించడం జరిగింది.అదేవిదంగా క్రీడాకారులను విష్ణువర్ధన్ రెడ్డి  పరిచయం చేసుకోవడం జరిగింది.

విష్ణువర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ

యువతకు క్రీడలు చాలా అవసరం అని అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తీసుకునే ఆహారం, మన అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరం అని అన్నారు.ఈకార్యక్రమం లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు భూపాల చారి,కాంగ్రెస్ నాయకులు సలీమ్, ఉపసర్పంచ్ కుక్కలి నర్సింహా,కుమ్మరి హరీష్,బోయ అశోక్, రాజు, గొల్ల మల్లేష్, రవీందర్ రెడ్డి, పరిగి శివకుమార్, యాదగిరి గౌడ్, శశిధర్,చెనగళ్ల కృష్ణయ్య, బీమ్ రాజ్, రామకృష్ణ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అంతయ్య,తదితరులు పాల్గొన్నారు.