పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి
  • తెలంగాణలో మొండి చేతితో మోడీ పర్యటన చేస్తున్నారని హేళన
  • శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నల్లగొండ:పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకుండా మోడీ మొండి చేతితో పర్యటన చేస్తున్నారని హేళన చేశారు. పర్యటన కోసం వచ్చి మొండి చేయి చూపించి పోయే మోడీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వరు, మిషన్ కాకతీయ పథకం కోసం ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఎంతసేపు తెలంగాణ పై అక్కస్ వెళ్ళగకుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ పర్యటన వల్ల తెలంగాణకు ఓరిగేదేమీ లేదు జరిగేదేమి లేదన్నారు. గవర్నర్ ఏమేమి మాట్లాడుతున్నారు. ఆరోపనలు చేస్తూ గవర్నర్ పై ఎవరు రాళ్లు వేయడం లేదన్నారు. ఆమె ఆవేదన పడుతున్నారన్నారు. నల్లగొండ జిల్లాలో ఎన్నడు జరగని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. సోమవారం నల్లగొండలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించి నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ఐటీ హబ్ తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారన్నారు. జరిగిన అభివృద్ధితో అందమైన జిల్లా కేంద్రంగా నల్లగొండ పట్టణ మారిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి వల్లనే అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు.