భక్తిశ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పల్లకి సేవ

భక్తిశ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పల్లకి సేవ
  • దేవాలయానికి వచ్చిన భక్తజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన అర్చకులు రఘుపతిరావు

షాద్ నగర్: భక్తిశ్రద్ధలతో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం షాద్ నగర్ సమీపంలోని చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో భీష్మాష్టిమి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు భజన కార్యక్రమాలను చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్రరావు, రఘుపతిరావు, రాఘవేంద్ర చారి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి ఆరాధన అభిషేకము వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకి సేవలో వైభవంగా నిర్వహించారు.

లింగారెడ్డి గూడ గ్రామానికి చెందిన తబలా ప్రవీణ్ బృందం, షాబాద్ మండలం మన్మారి గ్రామానికి చెందిన భజన భక్తజన బృందం సభ్యులతో ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తి గీతాలతో పాటు భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు హైకోర్టు న్యాయవాది రాధా కిషన్ రావు పద్మావతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవాలయంలో ప్రతి శనివారం స్వామివారి పల్లకి సేవ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు కుమార్ గౌడ్, వసంతరావు, రఘు గౌడ్, గడ్డమీద రమేష్, సుధాకర్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, లక్ష్మణ్, కిషన్ నాయక్, రాఘవేందర్, నారాయణ, హనుమంత్ రెడ్డి, నర్సింలు, వెంకటేష్, బచ్చన్న, సత్తయ్య గౌడ్, సింగపాగ లక్ష్మయ్య లతోపాటు మహిళా భక్తులు పాల్గొన్నారు.