కండ్లు మూసుకొని పంచాయతీ కార్మికుల నిరసన

కండ్లు మూసుకొని పంచాయతీ కార్మికుల నిరసన


మోత్కూర్( ముద్ర న్యూస్ ):మోత్కూరు మండలం లో గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె 18వ రోజు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగాపంచాయతీ కార్మికులు కండ్లు మూసుకొని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సూరారం నాగయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి. 60 వ జీవో ను అమలు చేయాలి,ప్రమాదం జరిగి మరణించిన కార్మికుని కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలి.సిబ్బందికి పి ఎఫ్ఈ ఎస్ ఐ, ప్రమాద బీమా గ్రాట్యుటీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోబంగారి, మల్లేష్, సైదులు,బుచ్చయ్య, లక్ష్మీ, స్వామి,ఎల్లమ్మ,సుదర్శన్,అంజయ్య,కృష్ణా తదితరులు పాల్గొన్నారు.