విద్యార్థులకు చదువుతో పాటు డ్రగ్స్ నిర్మూలన పై అవగహన పెంచాలి...

విద్యార్థులకు చదువుతో పాటు డ్రగ్స్ నిర్మూలన పై అవగహన పెంచాలి...
  • టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్(పేపర్ శ్రీనన్న)
  • శ్రీ కాకతీయ హై స్కూల్ లో గ్రాడ్యుయేట్ డే లో పాల్గొన్న పేపర్ శీనన్న...

ముద్ర, షాద్ నగర్: విద్యార్థులకు చిన్నప్పటి నుండి చదువుతోపాటు సమాజంలో జరుగుతున్న మంచి చెడులపై, ముఖ్యంగా డ్రగ్స్ పై ఖచ్చితంగా అవగాహన కల్పించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ అన్నారు.. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శ్రీ కాకతీయ హై స్కూల్ లో ప్రిన్సిపాల్ స్వాతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ డే నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టియుడబ్ల్యూజే (ఐజేయు)రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు..

ఈ సందర్భంగా గుడిపల్లి శ్రీనివాస్ గ్రాడ్యుయేట్ డే లో పాల్గొని విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ షాద్ నగర్ పట్టణంలోని కొన్ని పాఠశాలలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారాయని ధనార్జన ధ్యేయంగా వారి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, విద్యార్థులు చదువుతున్నారా లేదా అని పట్టించుకోవడమే మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు... అలాంటి పాఠశాలలపై త్వరలో దృష్టి సారించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.. విద్యార్థులకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాలను మెలిక తీయవచ్చు అని, నిరంతరం కాకతీయ హైస్కూల్లో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటున్నారని అన్నారు.. ఇలాంటి కార్యక్రమాలతో కాకతీయ హై స్కూల్ కు ముందు ముందుగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు....