జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. పవన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ ఎన్నికయ్యారు.