ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పవన్‌ కల్యాణ్‌. .విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్..పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, పర్యావరణ, అటవీశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. పలు శాఖల అధికారులు పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు.

పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలిపిన మంత్రులు

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌కల్యాణ్‌కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, తెదేపా నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు.

పవన్‌ కల్యాణ్‌ షెడ్యూల్

ఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ

మ.12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో సమావేశం–

మ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ

ఈరోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస చేయనున్నారు.