ఘనంగా పెద్దమ్మ బోనాల పండుగ

ఘనంగా పెద్దమ్మ బోనాల పండుగ

ముద్ర, రుద్రoగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో తూర్పువాడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం రోజున పెద్దమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా ముదిరాజ్ కులస్తుల ఆరాధ్యదైవం అయిన పెద్దమ్మ తల్లికి డప్పు చప్పుళ్ళు నడుమ బోనాలు సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ అన్నారు.

ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలు అందరూ పడి పంటలతో, సంతోషంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు రాగుల మహేష్, బిలవేని లక్ష్మన్,గండి నారాయణ, కొమిరె శంకర్,పొగుల నర్సయ్య,పిసరి శ్రీనివాస్,రాగులమల్లేష్,పొగుల దేవయ్య,కొమిరె గంగానర్సయ్య ,పాల నర్సయ్య,ఉరుమడ్ల నర్సయ్య ముదిరాజ్ కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.