అక్రమాలకు నిలయంగా బస్ స్టేషన్....

అక్రమాలకు నిలయంగా బస్ స్టేషన్....

ఆలేరు. ముద్ర :- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్ స్టేషన్ అనేక అక్రమాలకు కేంద్రంగా మారిందని ప్రజలు అంటున్నారు. నిత్యం హైదరాబాదు నుండి వరంగల్, వరంగల్ నుండి హైదరాబాదుకు వేలాదిమంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. బస్సు స్టేషన్లో రక్షణ కరువై అక్రమార్కులు అడ్డగామార్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాగుబోతులు నిత్యం మద్యం మత్తులో గొడవలు సృష్టించిన సంఘటనలు అనేకం జరిగాయి.

 విద్యాసంస్థల ముగింపు సమయంలో కొంతమంది యువకులు బస్ స్టేషన్ లో ద్విచక్ర వాహనలపై ప్రమాడకరంగా చేసే విన్యాసాల వలన విద్యార్థినిలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో నిత్యం ప్రయాణికుల విలువైన వస్తువులు చోరీ అవుతున్నాయి. రాత్రి వేళలో బస్ స్టేషన్ లో సరైన విద్యుత్ దీపాలు లేక చీకటిగా ఉండడంతో అక్రమార్కులు తమకు న్యాయంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వెంటనే సంబంధిత అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.