పాలక ప్రభుత్వాల హామీలను ప్రజలు నమ్మొద్దు....

పాలక ప్రభుత్వాల హామీలను ప్రజలు నమ్మొద్దు....
  • దోపిడి వ్యవస్థ అంతం కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి.....
  • సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్దన్ పిలుపు.....

ఆలేరు (ముద్ర న్యూస్)అధికారం. పదవులు. సంపాదనే లక్ష్యంగా ఎంచుకున్న పాలక ప్రభుత్వాలు (ప్రజాప్రతినిధులు) తమ పార్టీల విధానాలు. మోసపూరిత వాగ్దానాలను నమ్మి వారు చేసే పనిలో ప్రజలు సహకరించినంత కాలం మోసపోతూనే ఉంటారని ఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్ అన్నారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని టిఎన్జీవో భవనంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజా సంఘాల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుత దోపిడీ వ్యవస్థను ప్రజలు చైతన్యవంతంతో అర్థం చేసుకొని దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడకుంటే ప్రజలకు విముక్తి కలుగదని చెప్పారు. దేశంలో. రాష్ట్రంలో అసమానతలు. దోపిడీ. పీడనలకు. అణచివేతలకు. అన్యాయానికి గురి చేస్తూనే ప్రస్తుత పాలకవర్గ దోపిడీ వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తూ కాపాడుకుంటుందని ఆరోపించారు. అశేష ప్రజానీకం అయినా శ్రామిక వర్గ ప్రజలతోపాటు అన్ని వర్గాల ప్రజలపై అనేక విధానాలుగా పెత్తనం చెలాయిస్తూ వేడుకడు నందిగా ఉన్న బడ పెట్టుబడి దారి కార్పోరేట్ సంస్థలకు. పెట్టుబడిదారులకు. సామ్రాజ్యవాదులకు పాలక ప్రభుత్వాలు ఊడిగం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రజల మధ్య ఉన్న ఐక్యతను కులం. మతం పేరుతో విచ్ఛిన్నం చేస్తూ వారు అనుకున్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ సమాజాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్నారని విమర్శించారు. అనేక దశాబ్దాల కాలంగా మనకు దేశంలోని పాలక ప్రభుత్వాల ఎజెండాను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. పదుల సంఖ్యలో ప్రజలకు హామీలు ఇస్తూ ఒకటి.

అర హామీలను అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన మోడీ. కెసిఆర్ ప్రభుత్వాలు వేట కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం. అమ్మకానికి పెట్టడం చేస్తున్నారని అన్నారు. ఏ రంగంలోనైనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తీసుకువచ్చిన రిజర్వేషన్ల ఉసే ఉండదని చెప్పారు. ఈ విధానాల వలన ఎస్సీ. ఎస్టి. బీసీ తో పాటు ఇతర మైనార్టీ క్రిస్టియన్లకు సామాజికంగా. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆనికి మనిగి ఉన్నంతకాలం మన బతుకులు ఇలాగే ఉండేందుకు పాలక ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు కుట్రలు చేస్తుంటారని హెచ్చరించారు. ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ. రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి నాయకులు ఇక్కిరి కుమార్ అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ. ఏఐకేఎంఎస్. పి వై ఎల్. ఐ ఎఫ్ టి యు. పి ఓ డబ్ల్యు నాయకులు ఆర్ సీత. పద్మ. శశిరేఖ. తమ్మడి మాధవి. ఉమా. బెజాడి కుమార్. చీరబోయిన రాజయ్య. పిన్నపురెడ్డి రాఘవరెడ్డి. పద్మ సుదర్శన్. సాదుల శ్రీకాంత్. గుండు బిక్షపతి. తమ్మడి అంజయ్య. వంగాల నరసింహారెడ్డి. కర్రె స్వామి. శికిలం వెంకటేష్. తమ్మడి రమేష్. ఆర్ ఉదయ్. ఊరడి రామచంద్రు. కొమ్మిడి గోపాల్ రెడ్డి. తమ్మడి మీనయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.....