రెండో విడత కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  న్యాలకొండ అరుణరాఘవరెడ్డి

రెండో విడత కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి  జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  న్యాలకొండ అరుణరాఘవరెడ్డి

ముద్ర కోనరావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని  జడ్పీ చైర్ పర్సన్  న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి  అన్నారు. సోమవారం కొనరావుపెట మండలం మామిడిపల్లి  గ్రామంలో  కంటి వెలుగు, పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్   మాట్లాడుతూ, అందరహిత సమాజం నిర్మాణం కోసమే  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు  కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలను ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో, నిర్వహించి వారికి మందులను కళ్ల అద్దాలను అందజేస్తున్నామన్నారు. ప్రజలు ఎవరు కూడా కంటి సమస్యలతో బాధపడవద్దనే ముఖ్య లక్ష్యంతో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి సర్పంచ్ కొక్కుల భారత, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, ఎంపిడిఓ రామకృష్ణ, ఎంపిఓ రాజు, ఉప సర్పంచ్ రాంరెడ్డి,  వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.