మాజీ మంత్రి అల్లోల ను చేర్చుకోవద్దంటూ మంత్రి సీతక్కకు వినతి పత్రం

మాజీ మంత్రి అల్లోల ను చేర్చుకోవద్దంటూ మంత్రి సీతక్కకు వినతి పత్రం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అవినీతి భూకబ్జాల బీఆర్ఎస్ నేత మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దంటూ విన్నవించారు.

బ్లాక్ మెయిలర్స్ చీటర్లను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు..

బ్లాక్ మెయిలర్స్ చీటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జూ అన్నారు. మాజీమంత్రి బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దంటూ నిరసన ఆందోళన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం గమనిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చే విషయం తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.