అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి

అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి

ముద్ర :తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో జరిగిన దళిత బంధు అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ తిరుమలగిరి మండల అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు  ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ నాయకులు మాట్లాడుతూ తిరుమలగిరి మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించిన అవినీతికి నిలయంగా మారిపోయిందని మండలంలోని తొండ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలకు గాను కేవలం నాలుగు గేదెలు మాత్రమే ఇచ్చారని వారన్నారు.

మిగతా డబ్బులు ఇవ్వకుండా లబ్ధిదారులను కాంట్రాక్టర్లు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్లు జిఎస్టి పేరుతో ఒక్కో లబ్ధి నుండి రెండు నుండి మూడు లక్షలు వసూలు చేస్తున్నారని వారన్నారు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ. తిరుమలగిరి ఎండిఓ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమన్న మాదిగ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై నరేష్ సిపిఎం పార్టీ మండల నాయకులు కడెం లింగయ్య .బిజెపి నాయకులు సంతోష్ ఏపూరి యాకన్న చింతకుంట్ల పరమేష్ ఎం సిపిఐ నాయకులు నలుగురు రమేష్ కందుకూరు శీను  గూగులోతు శీను. కుక్కల సోమేష్ లబ్ధిదారులు పల్లెల రామచంద్రు ఇటికాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు