ఫోటో గ్రాఫర్లను ప్రభుత్వం గుర్తించాలి.

ఫోటో గ్రాఫర్లను ప్రభుత్వం గుర్తించాలి.

మేళ్లచెరువు ముద్ర:- మండల వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫలర్లను గుర్తించాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షడు యాదగిరి, జిల్లా అధ్యక్షుడు కూకుట్ల లాలు ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలోని అభ్యాస్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్ల నూతన కార్యవర్గ  ప్రమాణ స్వీకార మహోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. మండలం కేంద్రంలో ఫోటోగ్రాఫర్లకు  4గుంటల స్థలాన్ని కేటాయించి భవనాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరారు.ఫోటో గ్రాఫర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఫోటో గ్రాఫర్లకు ప్రత్యేక నిధిని కేటాయించి ఆదుకోవాలన్నారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫోటో గ్రాఫర్ల దైనందిన జీవితాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సబ్సిడీని కల్పించి ఫోటోగ్రాపర్లను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన మండలఅధ్యక్షుడు భూక్యా నెహ్రు నాయక్, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి చంటి, కార్యదర్శి భూక్యా నాగు, మండల నాయకులు వనం రామారావు, శ్రీనివాస్ రెడ్డి, సోమలయ్య, హరి, జహారుద్దీన్, గోపి, శంకర్, చందర్ రావు, గురవయ్య, శ్రీనివాసరావు, వంశీ, నాని, బాలాజీ,వీర బాబు తదితరులు పాల్గొన్నారు.