భువనగిరి అభ్యర్థిగా పైళ్ల శేఖర్ రెడ్డి  కి అవకాశం.....

భువనగిరి అభ్యర్థిగా పైళ్ల శేఖర్ రెడ్డి  కి అవకాశం.....

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి శాసనసభ సభ్యుడిగా గత రెండు పర్యాయాలు ఎన్నికైన పైళ్ల శేఖర్ రెడ్డికి మూడవసారి భువనగిరి శాసనసభ నుండి పోటీ చేసేందుకు బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ అవకాశం కల్పించారు. పైళ్ల శేఖర్ రెడ్డి పేరును ప్రకటించగానే భువనగిరి నియోజకవర్గం లోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.