మొక్కలు నాటి.. సంరక్షించాలి

మొక్కలు నాటి.. సంరక్షించాలి

రామకృష్ణాపూర్,ముద్ర : ప్రతి ఒక్కరు ఖాళీ స్థలాలో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని క్యాతన పల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ నర్సరీ ముందు ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యా సాగర్,మేనేజర్ నాగరాజు, మెప్మా టిఎంసి శ్రీధర్,రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.