పోచమ్మ బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం

పోచమ్మ బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం
  • నర్సింగ పూర్,వంజరిపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు
  • భక్తులతో కలిసి స్టేప్పులేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : పోచమ్మ బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపమని జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ పేర్కొన్నారు.  జగిత్యాల రూరల్ మండలం నర్సింగా పూర్,వంజరి పల్లి గ్రామంలో పోచమ్మ బోనాలకు హాజరైన ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్  గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో భోనం ఎత్తుకుని, డప్పు చప్పుల్ల మధ్యలో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లి కి మొక్కు చెల్లించుకున్నారు.  ఎమ్మెల్యే  డా సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  స్థానికులతో కలిసి అదిరిపోయే  స్టెప్పులు  వేశారు. ఎమ్మెల్యే నృత్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. అందరితో కలిసి సామాన్యుడిలా నృత్యం చేసిన ఎమ్మెల్యేను చప్పట్లతో ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, బి అర్ ఎస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి, గంగారెడ్డి, తిరుపతి, రాజ నర్సయ్య, రాజీ రెడ్డి, గంగారాం, రవి, శ్రావణ్, ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.