పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వ్యాసరచన పోటీలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వ్యాసరచన పోటీలు
  • ఎస్పీ ప్రవీణ్ కుమార్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఆన్లైన్ లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నామని వివరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31 వరకు  కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియ జేశారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు మొదలగునవి విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రజాసంబంధాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. వ్యాసరచన కోసం ఆన్లైన్ లో https://forms.gle/b7bejvzfo6j29Vuz6 లింక్ ద్వారా వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యాసరచన పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటాయన్నారు. కేటగిరి-1 లో ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. వీరికి 'సమర్థవంతమైన పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం' అనే అంశంపై పోటీలుంటాయన్నారు. కేటగిరి-2 లో  డిగ్రీ , అంతకు పైబడిన విద్యార్థులకు 'సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం లో పోలీస్ పాత్ర' అనే అంశం మీద విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు ఉంటాయని తెలిపారు. పాల్గొనేవారు తమ రచనలను ఈ నెల 24 వరకు సమర్పించవచ్చని వివరించారు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అభ్యర్థులను బహుమతుల ప్రధానం చేసి, రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. 

పోలీసులకు వ్యాసరచన

పోలీసులకు కూడా వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.కేటగిరి-1లో కానిస్టేబుల్ అధికారి నుండి ఏఎస్ఐ స్థాయి అధికారి వరకు 'పోలీసులకు పని-జీవిత సమతుల్యత' అనే అంశంపై, కేటగిరి-2లో ఎస్ఐ స్థాయి అధికారి మరియు పై స్థాయి అధికారులకు 'సమాజంలో లింగ సమానత్వాన్ని కాపాడడంలో పోలీస్ పాత్ర' వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటాయన్నారు.ఇవే కాకుండా రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు ఉంటాయన్నారు.

షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు

విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు,రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు నిమిషాలకు తగ్గించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని తెలిపారు.ఫోటోలు, వీడియోలు ఈనెల 25 లోపు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో అందించాలన్నారు.