పేకాట స్థావరంపై పోలీసుల దాడి..?

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..?
  • 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
  • వారి నుండి రూ.2.60 లక్షల సొత్తు స్వాధీనం..?
  • పేకాటలో సుందిళ్ల గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి..?

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా సుందిళ్ల గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో 14 మందిని అరెస్టు చేసి రూ.2.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి గోదావరిఖని 1-టౌన్, 2-టౌన్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసినట్లు సమాచారం. గోదావరిఖని ఏసీపీ ఆదేశాల మేరకు దాడి చేసినట్లు తెలిసింది. ఈ పేకాట శిబిరంలో గ్రామానికి చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధి ఉన్నట్లు తెలిసింది.