సింగర్ మనో కుమారులపై పోలీస్ కేసు..

సింగర్ మనో కుమారులపై పోలీస్ కేసు..

మద్యం మత్తులో ఇద్దరిపై దాడిచేసి పరారీలో ఉన్న గాయకుడు మనో కుమారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్, మదురవాయల్కు చెందిన 16 ఏళ్ల బాలుడు వళసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి శిక్షణ పూర్తి చేసుకుని స్థానికంగా ఉన్న హోటల్లో ఆహారం తినేందుకు వెళ్లారు. ఆ సమయంలో గాయకుడు మనో కుమారుడు సహా ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్, 16 ఏళ్ల బాలుడితో గొడవపడి దాడి చేసినట్లు తెలిసింది.

గాయపడిన కృపాకరన్ కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అతని ఫిర్యాదు మేరకు వళసరవాక్కం పోలీసులు గాయకుడు మనో కుమారులు రఫిక్, సాహీర్, వారి స్నేహితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. మనో కుమారులు మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడి, దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.