లేడీ కిల్లర్స్ - అప్పు తీసుకుంటారు - అడిగితే కూల్‌ డ్రింక్‌లో సైనైడ్‌ కలిపి చంపేస్తారు..!

లేడీ కిల్లర్స్ -  అప్పు తీసుకుంటారు - అడిగితే కూల్‌ డ్రింక్‌లో సైనైడ్‌ కలిపి చంపేస్తారు..!

గుంటూరు జిల్లాలో మహిళా సైనైడ్ కిల్లర్స్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్లమూడిలో నాగూర్‌ బీని అనే మహిళ జూన్ నెలలో అనుమానాస్పదంగా మృతి చెందగా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, కేసు విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ముగ్గురు లేడీ కిలర్స్ అప్పు తీసుకుని, అడిగితే చంపేస్తారని దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. 

నాగూర్‌ బీని నుంచి అప్పు తీసుకున్న ముగ్గురు కిలాడీ లేడీలు ఆమె అప్పు అడిగినందుకు బ్రీజర్‌లో సైనెడ్ కలిపి చంపేసినట్లు గుర్తించారు. ఇలా మరో నాలుగు హత్యలు చేసినట్లు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు మునగప్ప రజని, ముడియాల వెంకటేశ్వరి, గొంతు రమణమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.గతంలో కంబోడియా వెళ్లొచ్చిన ప్రధాన నిందితురాలు వెంకటేశ్వరి అక్కడ పలు నేరాల్లో పాల్గొన్నట్టుగా అధికారులు గుర్తించారు.నిందితుల్లో మరొకరు వాలంటీర్‌గా పనిచేశారు. ముగ్గురు నిందితులు రెండేళ్లలో 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేశారని అది కూడా ఆ హత్యలను ఒకే స్టైల్‌లో చేసినట్లు తెలుస్తుంది. ఈ గ్యాంగ్‌కి సైనైడ్ అమ్మిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యారు.