మంచిర్యాల లో పోలీస్ ల ఓపెన్ హౌస్

మంచిర్యాల లో పోలీస్ ల ఓపెన్ హౌస్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం మంచిర్యాల పోలీస్ లు ప్రదర్శన నిర్వహించారు. హెల్మెట్ లు ధరించి ద్విచక్రవాహనాలతో పురవీధుల గుండా ర్యాలీ జరిపారు. అనంతరం జడ్పి పాఠశాల క్రీడా మైదానంలో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు.

ఈకార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, డీసీపి సుధీర్, ఎమ్మెల్యే దివాకర్ రావు, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి డీసీపీలు తిరుపతి రెడ్డి, నరేందర్, సదయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓపెన్ హౌస్ లో ఆయుధాలు, అవి ఎన్ని రకాలు, మెటల్ డిటెక్టర్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎలా చేస్తారు ,నేరపరిశోధనలో శునకాల పాత్ర ఎలా ఉంటుందో ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.  శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో ఉందని జిల్లా కలెక్టర్ సంతోష్ కొనియాడారు.