పోలీసుల సంక్షేమం, ఆరోగ్యంకు ప్రాధాన్యత- మంచిర్యాల డీసీపీ సుధీర్

పోలీసుల సంక్షేమం, ఆరోగ్యంకు ప్రాధాన్యత- మంచిర్యాల డీసీపీ సుధీర్

 ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : పోలీసుల సంక్షేమం, ఆరోగ్యం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డీసీపీ సుధీర్ కేకన్ అన్నారు. ఆదివారం ఏసీపీ కార్యాలయం ప్రాంగణంలో పోలీస్ లకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, నిత్యం విధి నిర్వహణ లో తలమునకలయ్యే సిబ్బంది ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పోలీసులకు సీపీఆర్, ఏఈ డీ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్ ఎలా చేయాలో మెడి లైఫ్ వైద్యులు శిక్షణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. పోలీసులకు బీపీ, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు చేయించినట్లు తెలిపారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ రాజు, రూరల్ సీఐ.సంజీవ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ. ప్రవీణ్, వైద్యులు చేతన్ చౌహన్, కుమార్ స్వామి, సిరిపురం శ్రీనివాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.