మావోయిస్టుల ఫోటోలతో అంటించిన పోస్టర్లు

మావోయిస్టుల ఫోటోలతో అంటించిన పోస్టర్లు

మావోయిస్టుల సమాచారం అందిస్తే బహుమతి..
మండలంలో పోస్టర్లు అంటించిన పోలీసులు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి :  మంగపేట మండలంలో నిషేధిత మావోయిస్ట్ ల సంచారానికి సంబందించిన సమాచారం అందిస్తే బహుమతి ఇస్తామని మంగపేట పోలీసులు ప్రకటించారు. మండలంలో నిషేధిత మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం తెలిపితే సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉండడంతో పాటు సమాచారం అందించి వారికి బహుమతి కూడా అందిస్తామని మండలంలో మంగళవారం మంగపేట పోలీసులు పోస్టర్లను అంటించారు. మావోయిస్టుల సంచారంకు సంబందించిన సమాచారం పోస్టర్లలో ఉన్న ఫోన్ నెంబర్లకు కానీ మంగపేట ఎస్సై కి కానీ తెలపాలని మంగపేట పోలీసులు తెలిపారు.