హైదరాబాద్ లో రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు....

హైదరాబాద్ లో రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు....
  • వైభవంగా ప్రారంభం అయిన రోటరీ సమావేశాలు.

అంతర్జాతీయ సేవా సంస్థ రోటరీ కాబోయే అధ్యక్షుడు మారియో సీజర్ వచ్చిన సందర్భంగా ఇండియా లో సౌత్ జోన్ రోటరీ సమావేశాలు శనివారం, 28 సెప్టెంబర్ 2024 న హైదరాబాద్ లో హోటల్ దశపల్లా లో ప్రారంభం అయ్యాయి. రోటరీ జిల్లా 3150 ఏర్పాటు చేసిన ఈ రెండు రోజుల మెంబర్షిప్ క్యాంక్లేవ్ కి హైదరాబాద్ ఈస్ట్ రోటరీ క్లబ్ హోస్ట్ గా వ్యవహరించింది.  

హైదరాబాద్ ఈస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ తలశిల మల్లికార్జున నరసయ్య చౌదరి సమావేశాలను ప్రారంభించగా , కాంక్లేవ్ ఆర్గనైజింగ్ చైర్మన్ Dr చిలుకూరు శరత్ బాబు, రోటరీ జిల్లా 3150 గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి ఈ సమావేశ విశిష్టత గురించి, చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు. 

రోటరీ నాయకులు దీపక్ పురోహిత్, రోటరీ డైరెక్టర్లు రాజు సుబ్రమణ్యన్, అనిరుధ్ రాయ్ చౌదరి, డైరెక్టర్ ఎలక్ట్ నాగేష్ రోటరీ సంస్థ లో సభ్యుల్ని పెంచుకోవాల్సిన అవశ్యకత గురించి మాట్లాడారు. 

రోటరీ సంస్థ కి 2025 - 26 కి కాబోయే అధ్యక్షుడు మారియో సీజర్ మాట్లాడుతూ ఇండియా గత 10-15 ఏళ్లుగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు బట్టి అన్ని బిజినెస్ సంస్థలు 30 కోట్ల మధ్య తరగతి జనాభా ను తమ టార్గెట్ గా పెట్టుకొన్నారు. అలాగే రోటరీ కూడా కొత్త సభ్యులను చేర్చుకోవటంలో ఎప్పుడూ ముందుండాలని అన్నారు. అదే విధంగా రోటరీ లో యువత ను, మహిళలను చేర్చుకోవాలని, అందుకోసం ప్రతి రోటరీ క్లబ్, ప్రతి రోటరీ సభ్యుడు ఒక పక్క సేవా కార్యక్రమాలు చేస్తూనే, రెండో పక్క కొత్త సభ్యులను ఆకర్షించే విధంగా క్లబ్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశం లో రోటరీ జిల్లా 3150 నాయకులు కే. ప్రభాకర్, గోపీనాథ్ రెడ్డి, జవహర్ వడ్లమాని, శామ్ పాటిబండ్ల, రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచలోనే అతి పెద్దదైన లాభాపేక్షలేని సేవా సంస్థ గా గుర్తింపు పొందింది. 140 దేశాలలో దాదాపు 40000 ల రోటరీ క్లబ్బులు, దాదాపు 12 లక్షల రోటేరియన్స్ నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తూ వుంటారు. 2023-24 సంవత్సరం లో దాదాపు 250 కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలను ఖర్చు పెట్టారు. దాదాపు 50 కోట్ల మంది రోటరీ సేవలు తీసుకొన్నారు.