జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత
Minister Puvwada at the dairy launch
  • ఐజెయుతో అనుబంధం విడదీయలేనిది
  • డైరీ ఆవిష్కరణలో మంత్రి పువ్వాడ

ముద్ర ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం ఖమ్మం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో TUWJ (IJU) 2023 Diary టియుడబ్ల్యూజె (ఐజెయు) 2023 డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఐజెయుతో అనుబంధం విడదీయలేనిదన్నారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐజెయు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఐజెయు అధ్యక్షులుగా ఉన్న కె. శ్రీనివాసరెడ్డితో మా కుటుంబానికి ముఖ్యంగా మా నాన్న పువ్వాడ నాగేశ్వరరావుకు మంచి అనుబంధం ఉందని వారిద్దరు ఉద్యమ సహచరులని మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. డైరీ రూపొందించడం నిజంగా అభినందనీయమని, వరుసగా గడచిన ఎనిమిదేళ్లుగా డైరీ తీస్తున్న ఖమ్మంజిల్లా కమిటీకి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఆవిష్కరణ సభలో ఐజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి అజయ్ కుమార్ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సుమారు ఆరు దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఐజెయు కృషి చేస్తుందని రాంనారాయణ తెలిపారు. డైరీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆవిష్కరణ సభలో మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసి ఛైర్మన్ దోరేపల్లి శ్వేత, ఆర్. జే. సి. విద్యా సంస్థల ఛైర్మన్ ఆర్జెసి కృష్ణ, టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, కోశాధికారి శివ, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, మాటేటి వేణుగోపాల్, సామినేని కృష్ణ మురారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి కూరాకుల గోపి, కోశాధికారి నామ పురుషోత్తం, అక్రిడేషన్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, మీడియా ప్రతినిధులు కళ్యాణ్ చక్రవర్తి, మోహినుద్దీన్, సాగర్, వాసు, సత్యనారాయణ, తాళ్లూరి మురళి, జనార్థనాచారి, బసవేశ్వరరావు, ఉపేందర్, తాతా శ్రీనివాసరావు, ఏలూరి వేణుగోపాల్, చిన్నా, జాకీర్, సుధాకర్, మేడి రమేష్, కమటం శ్రీనివాస్, ఆంజనేయులు, మధులత, శీలం శ్రీనివాస్, గోపాలరావు, వెంకట్, అయ్యప్ప పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.