సాధారణ ధాన్యానికి కూడా బోనస్ చెల్లించాలి

సాధారణ ధాన్యానికి కూడా బోనస్ చెల్లించాలి
  • బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతులకు సన్న వడ్లతో పాటు సాధారణ వడ్లకు కూడా రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో దిలావర్ పూర్ లో మంగళవారం నిరసన తెలిపారు. రాష్ర్ట శాఖ పిలుపు మేరకు జిల్లా సమన్వయ కర్త కొరిపల్లి రాంకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో భాగంగా ధాన్యం కళ్ళాల వద్ద నిరసనలు చేపట్టారు.కళ్ళలా వద్ద రైతులు, ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని అధోగతి పాలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. రైతన్నలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో ఓ  మాట, ముగిశాక మరో మాట చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, రైతాంగాన్ని మభ్యపెడుతున్నారని  విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు లేక రైతులు నిత్యం పడరాని పాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మారుగొండ రాము, జడ్పీ కోఆప్షన్ సభ్యులు డా.యు. సుభాష్ రావు, చిన్నారెడ్డి, మహమ్మద్ నజీరొద్దిన్, సుధాన్, గంగారెడ్డి, సాయిరెడ్డి, కృష్ణ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, సురేష్, అన్వర్, లక్ష్మణ చారి, నేల్ల అనిల్ తదితరులున్నారు.