గాయపడిన అంగన్వాడీ టీచర్ కుఆర్థిక సాయం అందజేత
ముద్ర,పానుగల్:- పానుగల్ మండలం అన్నారం సెక్టర్ శాగాపూర్ గ్రామ అంగన్వాడి టీచర్ అలివేల బైక్ పైనుంచి క్రిందపడి తలకు బలమైన గాయమై హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది.వనపర్తి జిల్లా తెలంగాణ అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (CITU) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అలివేల ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 1,34,700 వేల రూపాయలను అలివేల భర్త పరంధాములు కు అందజేశారు.
ఏఐజి హాస్పిటల్ లో చికిశ్చ పొందుతున్న అలివేలను సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్,జిల్లా సహాయ కార్యదర్శిలు,ఆర్ఎన్ రమేష్. సూర్యవంశం రాము, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి నారాయణమ్మ,జిల్లా ఉపాధ్యక్షులు కవిత,జిల్లా నాయకురాలు శారద తో పాటు పలువురు అంగన్వాడీ ఉద్యోగులు పరామర్శించారు.