తుంగతుర్తి మండలం లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ...
- జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన అధికారులు.
తుంగతుర్తి ముద్ర :- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శేషు కుమార్, తహసిల్దార్ కార్యాలయంలో దయానంద్, స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్, రైతు సేవ సహకార సొసైటీ కార్యాలయంలో సింగిల్విండో చైర్మన్ గుడిపాటి సైదులు, పంచాయతీ రాజ్ కార్యాలయంలో డి ఈ లింగయ్య నాయక్, విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ బోయిని లింగయ్య, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో బాలకృష్ణ,ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీవో కృష్ణ, మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం నరసయ్య, వెటర్నరీ కార్యాలయంలో ఏడి రవి ప్రసాద్, ఏరియా ఆసుపత్రిలో సూపర్డెంట్ నిర్మల్ కుమార్, ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ రజిత జాతీయ జెండా ఆవిష్కరించగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి, సిపిఎం రాజకీయ పార్టీల కార్యాలయంలో ఆయా పార్టీల మండల అధ్యక్షులు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... అమరవీరుల పోరాటాలు వారి త్యాగాలను స్మరించుకున్నారు.