పారదర్శక పాలన కు ప్రజాపాలన తొలి అడుగు – వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

పారదర్శక పాలన కు ప్రజాపాలన తొలి అడుగు  – వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

ముద్ర.వనపర్తి:-నిస్సహాయులైన అర్హులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించాలన్నా ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.గురువారం వనపర్తి జిల్లా కేంద్రం లోని 14 వార్డు బ్రహ్మంగారి ఆలయంలో లోఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి,జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా మాట్లాడుతూ అభయాస్తం ఆరు గ్యారెంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనీ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు.వనపర్తి జిల్లా లోని 255 గ్రామపంచాయతీలలో, ఐదు మున్సిపాలిటీలు 79 వార్డులలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ,డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పని దినాలలో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

ప్రజా పాలన కార్యక్రమం లో 6 గ్యారెంటీలతోపాటు ఆహార భద్రతా కార్డు/రేషన్ కార్డు కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి, విద్యుత్ శాఖ డి నరేంద్ర కుమార్, కౌన్సిలర్లు  బ్రహ్మం చారి,చీర్ల చందర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు