ప్రజా ఆరోగ్యం  ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా ఆరోగ్యం  ప్రభుత్వ లక్ష్యం.
  •  గ్రామాల్లో పల్లె దవఖానాలు- పట్టణాల్లో బస్తీ  దవాఖానాలు
  •  డెంగ్యూ నిర్మూలన మన సామాజిక బాధ్యత.

కోదాడ, ముద్ర:అందరిని ద్రాక్షగా ఉన్న ఖరీదైన కార్పొరేట్ ప్రవేట్ వైద్యం తెలంగాణ ప్రభుత్వం పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుబాటులోకి తెచ్చిందని కోదాడ   శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని కాశీనాథన్ ఫంక్షన్ హాల్ లో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సు మానవహరం ర్యాలీల్లో ఆయనలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.... గత పాలకవర్గాలు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసాయని వారి నిర్లక్ష్యంతో శిశుమరణాలు అంటువ్యాధులు ప్రభలి  ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే వారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యం లక్ష్యంగా తీసుకుని ప్రజల ఇంటి ముంగిటకు వైద్యం అందుబాటులోకి తెచ్చింది అన్నారు. గ్రామాల్లో పల్లె దవఖానాలు ఏర్పాటు చేయడం పట్నాలలో బస్తీ దవఖాన ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తల్లి గర్భం లో ఉన్న శిశువు మొదలుకొని వయోవృద్ధుల వరకు  ప్రభుత్వం అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తుందన్నారు.

డెంగ్యూ మలేరియా కలరా వంటి వ్యాధుల నివారణ మనందరి సామాజిక బాధ్యత అన్నారు. పరిసరాల పరిశుభ్రత తోనే అంటు వ్యాధుల నిర్మూలన జరుగుతుందన్నారు. ఇంటి పరిసరాల్లో వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మురుగునీరు నిల్వ ఉండటం వలన దోమల వ్యాప్తి జరుగుతుందని పారిశుద్ద్య సిబ్బంది అప్రమత్తం కావాలన్నారు. డెంగ్యూ వ్యాధికి గురైన వారికి ప్రభుత్వ వైద్యం తక్షణమే అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ మానవహారం లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కోటాచలం, ఉప వైద్యాధికారి  నిరంజన్, డాక్టర్లు కళ్యాణ్ చక్రవర్తి, సాహితీ, వెంకటరమణ,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,   యూనియన్ లీడర్ యాతాకుల మధుబాబు, ఏ ఎం ఓ   షాబుద్దీన్, నాయకులు చందు నాగేశ్వరరావు,  వెంపటి మధుసూదన్, షేక్ మదర్, అపర్ణ వెంకట్, కందుల చంద్రశేఖర్,  వంటిపులి శ్రీనివాస్,  సర్పంచులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సంపేట ఉపేందర్ గౌడ్, డాక్టర్లు, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.