రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుని పూజలు

రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుని పూజలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ మండలం అక్కాపూర్ లో  గురువారం ప్రతిష్టించిన రేణుక ఎల్లమ్మ ఆలయంలో నిర్మల్ జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన అంజు కుమార్ రెడ్డికి వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈయన వెంట బిజెపి నాయకులు నారాయణ గౌడ్, గౌడ సంఘం నాయకులు, జీవన్ గౌడ్ లింగా గౌడ్, ఉపేందర్ గౌడ్ ,రవి గౌడ్, కృష్ణమోహన్ గౌడ్ తదితరులున్నారు.