రహదారి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా

రహదారి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా

బాధితులకు పుస్కురి రామ్మోహన్ భరోసా

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : లక్షేట్టిపెట్ నుంచి హజీపూర్ వరకు 63వ జాతీయ రహదారి డిజైన్ మార్పు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పుస్కురి రామ్మోహన్ రావు భరోసా ఇచ్చారు. 63వ జాతీయ రహదారి నూతన డిజైన్ వల్ల ఇండ్లు కోల్పోవలసి వస్తుందని బాధితులు హజీపూర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా శిబిరంకు వెళ్లి బాధితులను రాంమ్మోహన్ రావు కలిశారు. రాహదారి నిర్మాణం మార్పు చేయాలని ముఖ్యమంత్రి ని , రహదారులు, భవనాలు శాఖ మంత్రిని కలిసి బాధితుల సమస్యలు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

రహదారు నిర్మాణం పంట పొలాల నుంచి వెళ్తే అభ్యంతరం లేదని స్థానికులు చెబుతున్నారని అన్నారు. ఇండ్ల మధ్య నుంచి వెళ్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అందరికి ఆమోదయోగ్యమై న రహదారి నిర్మాణంకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో బీఆరెస్ నాయకులు శ్రీనివాసరావు, దొమ్మటి సత్తయ్య, బొడ్డు శంకర్, సింగతి మురళి, ఒడ్నాల శ్యామ్, భీమన్న, రమేష్ పాల్గొన్నారు.