నాణ్యమైన 134 పరీక్షలు ఉచితం

నాణ్యమైన 134 పరీక్షలు ఉచితం
  • అన్ని సేవలు ప్రజల ముంగిట్లోకే: కలెక్టర్ వరుణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పేదలకు వైద్యసేవలు అందుబాటులోకి రావటంతో  పాటు కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయని నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో శనివారం నుంచి 134 వైద్య సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు లాంఛనంగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అనంతరం సేవలను కలెక్టర్ లాంఛనంగా సేవలు ప్రారంభించారు.రూ.6కోట్ల తో నిర్మించిన డయాగ్నొస్టిక్ హబ్ భవనాన్ని ప్రారంభించిన  అనంతరం ఆయన మాట్లాడుతూ డయాగ్నోసిస్ హబ్ ద్వారా ఉచితంగా 134 రకాల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు.గతంలో 57 రకాల పరీక్షలు ఉచితంగా అందించామని, శనివారం నుంచి అదనంగా అనీమియా, యాంటి బ్యాక్టీరియల్ టెస్ట్, హర్మోనల్ టెస్ట్, క్యాన్సర్ పరీక్షలు, తలసేమియా, ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ, హెచ్ఐవీ టెస్ట్, వైరల్ లోడ్ టెస్ట్ వంటి వ్యాధులను గుర్తించే  మొదలగు 77 పరీక్షలు అదనంగా అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగాయని అన్నారు. 

డయాగ్నస్టిక్ హబ్ ద్వారా 24 గంటల్లో రోగులకు, వైద్యులకు సెల్ ఫోన్ ద్వారా పరీక్ష ఫలితాలు తెలుస్తాయని అన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ హబ్ లో ఎక్స్ రే, 2డీ ఈకో, మామ్మోగ్రామ్, అల్ట్రా సౌండ్, ఈసిజి, యూసిజీ, పాథాలజీ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నామని, 134 రకాల వైద్య పరీక్షలు అందుతాయన్నారు. రేడియాలజీ ల్యాబ్ లో మామ్మోగ్రామ్ వద్ద మహిళా ఆపరేటర్ మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నేపథ్యంలో సీజ నియం వైద్యారోగశాఖ అధికారుల ఎమ్మెల్యేలు, జిల శ మంగళవారం ఆజిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో  (6),  ప్రజలకు మరింత విస్తృతంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.  వైద్యరంగంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని, ప్రజల కు నాణ్యమైన సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం, నర్సింగ్ కాలేజీలు, మాతా, శిశు ఆరోగ్య కేంద్రాలు, ప్రతి నియోజకవర్గ పరిధిలో డయాలసిస్ కేంద్రం,  ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో   మున్సిపల్ చైర్మన్  ఈశ్వర్, సూపరెండెంట్  దేవేందర్ రెడ్డి,   ప్రజాప్రతినిధులు,  వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.