ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి
  • రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ఆర్టీసీ లో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈమేరకు గురువారం మంచిర్యాల లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎన్నికలతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించారు. వేతనాలు సవరణ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఆర్టీసీ కి రాయితీలు ప్రకటించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎ ఐ టీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, న్యూడెమోక్రసి నాయకుడు శ్రీనివాస్, ఆర్టీసీ సీనియర్ నాయకుడు బాబాన్న తదితరులు పాల్గొన్నారు.