ఆదానీ కంపెనీలపై రాహుల్ గాంధీ పార్లమెంటులో నిలదీస్తారనే భయంతోనే అనర్హత వేటు..

ఆదానీ కంపెనీలపై రాహుల్ గాంధీ పార్లమెంటులో నిలదీస్తారనే భయంతోనే అనర్హత వేటు..
  • దేశ ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర..,
  • ఆదానీ - మోదీ చీకటి స్నేహంపైన నిలదీస్తారనే ఈ రకమైన కుట్ర..
  • హాథ్ సే హాథ్ జోడో యాత్రలో గండ్ర సత్యనారాయణ రావు..

ముద్ర న్యూస్ రేగొండ :ఆదానీ కంపెనీలపై రాహుల్ గాంధీ పార్లమెంటులో నిలదీస్తారనే భయంతోనే ప్రధాని మోదీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు విమర్శించారు.
జీఎస్సార్ హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా  ఆదివారం పెద్దంపల్లి, రేగొండ, రంగయ్యపల్లి గ్రామాలల్లో గండ్ర సత్యనారాయణ రావు యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు యిప్పకాయల నర్సయ్య* ఆధ్వర్యంలో సాగింది.
ఈ యాత్రలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి యాత్ర చేపట్టారు. అనంతరం యాత్రలో భాగంగా పలు గ్రామాలల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాలను జీఎస్సార్ ఆవిష్కరించారు. ఆయా గ్రామాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. పెద్దంపల్లి గ్రామంలో చిన్నపిల్లలకు చాక్లెట్లను పంచి, ఓ ఇంటి వద్ద పిండి వంటలు చేస్తున్న వృద్ధురాలితో మాట్లాడుతూ పిండివంటలను కాల్చారు.


 పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలల్లో గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. దేశంలోని ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు అని అభిప్రాయపడ్డారు.  అదానీ వ్యవహారంపై చర్చ పెట్టకుండా ఉండేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలేనని తెలిపారు. ఈ కుట్రపై కాంగ్రెస్ న్యాయపోరాటం చేస్తుందని తెలిపారు. దేశ ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టడం, అదానీ - మోడీ చీకటి స్నేహంపై నిలదీయడం, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.చరిత్రలో ఏ నియంత శాశ్వతంగా అధికారంలో ఉండలేదన్నారు. 

ప్రధాని మోదీ, అదానీపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాలుగాప్రయత్నిస్తోందన్నారు. మోదీ వైఫల్యాలన్నింటినీ రాహుల్ గాంధీ.. ప్రజల ముందు పెట్టారన్నారు.ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
ఈ కార్యక్రమం లో టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువన సుందర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రెసిడెంట్ భట్టు కరుణాకర్, భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, మండల సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య, గూటోజు కిష్టయ్య,  మేకల రవికుమార్, బొల్లేపల్లి చంద్రమౌళి, మేకల భిక్షపతి,  గండి తిరుపతి గౌడ్, మొట్టే కిరణ్, కనకం రమేష్, యం.డి ఫారూక్, బోజ్జం రవి, నాంసాని రాంబాబు, కోలేపాక సాంబయ్య, ప్రసంగి, పోనుగోటి వీరబ్రహ్మం, జీవ్వాజి వీరస్వామి లతో పాటు ఆయా గ్రామ కమిటీ నాయకులు ఉన్నారు.