వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య 

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య 

ముద్ర,వరంగల్:- వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఖరారు చేశారు. కడియం కావ్య ఎన్నికల్లో పోటికి నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో రాజయ్యను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నది. కడియం కావ్య అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. తమ పార్టీ తరపున సీనియర్ నాయకుడు రాజయ్యను బరిలోకి దింపింది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టికెట్ ఆశించి భంగపడటంతో ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. అయితే, సీఎం రేవంత్ ను కలిసి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఇప్పటి వరకు నిర్ణయం ప్రకటించలేదు.  వేరే ఏ పార్టీలోనూ చేరకపోవడంతో వరంగల్ ఎంపీ ఎన్నికల్లో ఆయనను పోటీచేయిందుకు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మంతనాలు సాగించారు. రాజయ్య కూడా పోటీచేసేందుకు ఆసక్తి చూపించారు.  దీంతో రాజయ్యను వరంగల్ లోకసభ అభ్యర్ధిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.