అవార్డులకే వన్నె  తెచ్చిన మెగాస్టార్

అవార్డులకే వన్నె  తెచ్చిన మెగాస్టార్
  • అన్నయ్య బాటలోనే మేమంతా
  • మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలియజేసిన రాజు నాయక్ 
  • మెగాస్టార్ సేవలకు పద్మ విభూషణ్  ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ముద్ర, షాద్ నగర్: అవార్డులకే వన్నె తెచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని రంగారెడ్డి జిల్లా మెగా నాయకుడు జరుపుల రాజు నాయక్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కి పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల రాజు నాయక్   చిరంజీవిని ఆయన నివాసం లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గత 25 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ కు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించడం హర్ష నియమని అన్నారు. ప్రభుత్వాలు చేయని పనులను సైతం అభిమానులతో కలిసి అవార్డుల కోసం కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని తెలిపారు . 25 సంవత్సరాలుగా రక్తదానం, నేత్రదానం వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు  కరోనా సమయంలో అన్నం లేక బాధపడుతున్న  ఎన్నో వేల కుటుంబాల కడుపులు నింపి ఆరాధ్య దైవంగా నిలిచారని గుర్తు చేశారు. మెగాస్టార్ చిరంజీవి చూయించిన సేవా కార్యక్రమాల బాటలోనె తామంతా నడుస్తామని ఆయన తెలిపారు. ఏ వ్యక్తికైనా అవార్డులు వరిస్తే ఆ వ్యక్తికి కీర్తి ప్రతిష్టలు సమాజంలో గౌరవం దక్కుతుందని, కానీ మెగాస్టార్ చిరంజీవి కి అవార్డు రావడం అనేది అవార్డులకే వన్నె తెస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రంగారెడ్డి జిల్లా చిరంజీవి అభిమానుల సంఘం తరఫున రాజు నాయక్కృ తజ్ఞతలు తెలిపారు.