ఎఫ్ఎన్ సీసీ అధ్యక్షుడిగా రామారావు - 795 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు
- ఏకగ్రీవంగా ఏడు పోస్టులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్ సీసీ) అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్ధిపై 795 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ఈ ఎన్నికల్లో కార్యదర్శి తుమ్మల రంగారావు, సంయుక్త కార్యదర్శి సదాశివారెడ్డిలతో పాటు కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, ఎం. మురళీమోహన్ రావు, ఎస్. నవకాంత్, జె. బాలరాజులు సైతం కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా ఎస్.ఎస్. రెడ్డి, కోశాధికారిగా శైలజ జాజుల ఎన్నియ్యారు. అలాగే ఏడిద సతీష్ (రాజ), వివిజి కృష్ణంరాజు (వేణు), సిహెచ్ వర ప్రసాదరావు, కోగంటి భవాని కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇదీలావుంటే అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, పర్మినెంట్ కమిటీ సభ్యుల ఎన్నిక కోసం పది రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే.