రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు.. అంత్యక్రియల్లో హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు...

రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు.. అంత్యక్రియల్లో హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు...

ముద్ర,తెలంగాణ:-రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్ధం రామోజీ మృతదేహాన్ని శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం వద్ద ఉంచారు. రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామోజీరావు మృతదేహ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి అంత్యక్రియలు జరిగే స్మృతివనం వద్దకు అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, రామోజీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్మృతివనం వద్ద రామోజీ అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సృజనా చౌదరి, ఎన్వీ రమణ, పువ్వాడ అజయ్ కుమార్, అరెకపూడి గాంధీ, శశిధర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, వీ హన్మంతరావుతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమయాత్ర వాహనం నుంచి అంత్యక్రియలు జరిపే స్మృతివనం వద్దకు రామోజీ పార్ధీవదేహాన్ని తీసుకెళ్లే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాడెను మోసి రామోజీకి ఘనంగా నివాళులర్పించారు.