రంగనాథ స్వామి ఆలయాన్ని పర్యాట కేంద్రంగా అభివృద్ధి చేస్తాము

రంగనాథ స్వామి ఆలయాన్ని పర్యాట కేంద్రంగా అభివృద్ధి చేస్తాము
  • పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర.వనపర్తి:-వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లోని రంగనాథ స్వామి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని పర్యాట ప్రాంతంగా దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో కలసి ఆదివారం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, ఎమ్మెల్యే రంగసముద్రం ప్రధానకాలువను పరిశీలించారు. వీటితోపాటు జూరాల కాలువలకు  మరమ్మత్తులను చేయాల్సిన అవసరం ఉందని తప్పకుండా చేయించి ప్రతి ఆయకట్టుకు చివరి రైతు వరకు నీళ్లు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ జెడ్పిటిసి కృష్ణ ప్రసాద్ యాదవ్ తదితరులు ఉన్నారు.