కోదాడ విజయ హాస్పిటల్ లో అరుదైన శాస్త్ర చికిత్స 

కోదాడ విజయ హాస్పిటల్ లో అరుదైన శాస్త్ర చికిత్స 
  • మహిళ కడుపులో నుండి ఏడున్నర కేజీల కణితి తొలగింపు.
  • .ప్రాణాపాయ స్థితి లో ఉన్న మహిళ ప్రాణాలు కాపాడిన  డాక్టర్ కంభంపాటి వంశీకృష్ణ.        

కోదాడ, ముద్ర:కోదాడ పట్టణంలోని విజయ హాస్పటల్లో    డాక్టర్  ఎమ్.ఎస్ జనరల్ సర్జన్ కంభంపాటి వంశీకృష్ణ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి మహిళ ప్రాణాలు కాపాడారు. డాక్టర్ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి కి చెందిన ఉమారాణి అనే మహిళ కడుపులో నొప్పితో బాధపడుతూ బుధవారం వైద్యశాలకు వచ్చిందని తెలిపారు. సంబంధిత పరీక్షలు నిర్వహించి కడుపులో కణితి ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. వెంటనే శస్త్ర చికిత్స చేసి కనితిని తొలగించామన్నారు.థైరాయిడ్ గ్రంధి హార్మోనులు ,ఓవరియన్ల హార్మోనుల అసమతుల్యత వల్ల  ఈ కణుతులు ఏర్పడతాయని తెలిపారు. వీటిని వెంటనే గుర్తించి శాస్త్ర  చికిత్స ద్వారా తొలగించాలని లేనిపక్షంలో అవి పగిలి పోతే ప్రాణాలకు హాని కలుగుతుందని  డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. అరుదైన శస్త్ర చికిత్స చేసి మహిళా ప్రాణాలు కాపాడిన డాక్టర్ వంశీకృష్ణను పేషెంట్ తాలూకు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.