ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్

ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మే 13 న రాష్ట్రంలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన పోలింగ్ జరిగింది. సాయంత్రం 06 గంటలకే ఈసీ ఆదేశాలతో పోలింగ్ కేంద్రాల గేట్స్ క్లోజ్ చేసినప్పటికీ..కేంద్రంలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఇచ్చారు. పలు ప్రాంతాల్లో అర్ధర్రాతి వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాతో కలుపుకొని ఏపీలో పోలింగ్ 82.37 శాతానికి చేరినట్టు అంచనా. అన్నిచోట్లా పోలింగ్‌ ముగిశాక ఓటింగ్ 81.30 శాతంగా ఉండగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 1.07 శాతంతో కలుపుకొని మొత్తం పోలింగ్‌ 82.37 శాతానికి చేరిందని ఎన్నికల సంఘం ప్రాథమికంగా అంచనా వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 2009లో 72.63 శాతం, 2014లో 78.90శాతం, 2019లో 79.80 శాతంగా నమోదయాయి.

జిల్లాలవారీగా ఓటింగ్ శాతం ఇదే..


అల్లూరి – 63.19 శాతం
అనకాపల్లి – 81.63 శాతం
అనంతపురం – 79.25 శాతం
అన్నమయ్య – 76.12 శాతం
బాపట్ల – 82.33 శాతం
చిత్తూరు – 82.65 శాతం
కోనసీమ – 83.19 శాతం
తూర్పు గోదావరి – 79.31 శాతం
ఏలూరు – 83.04 శాతం
గుంటూరు – 75.74 శాతం
కాకినాడ – 76.37 శాతం
కృష్ణా – 82.20 శాతం
కర్నూలు – 75.83 శాతం
నంద్యాల – 80.92 శాతం
ఎన్టీఆర్ – 78.76 శాతం
పల్నాడు – 78.70 శాతం
పార్వతీపురం – 75.24 శాతం
ప్రకాశం – 82.40 శాతం
నెల్లూరు – 78.10 శాతం
సత్యసాయి – 82.77 శాతం
శ్రీకాకుళం – 75.41 శాతం
తిరుపతి – 76.83 శాతం
విశాఖపట్నం – 65.50 శాతం
విజయనగరం – 79.41 శాతం
పశ్చిమ గోదావరి – 81.12 శాతం
వైఎస్సార్ – 78.72 శాతం