17 వ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాల విడుదల

17 వ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాల విడుదల

ముద్ర.వనపర్తి:- వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి దగ్గర గల సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వరదత్తదేవస్థానము పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాలను సోమవారం ఆలయకమిటి  విడుదల చేశారు. బ్రహ్మోత్సవాలను ఈనెల 19 వతేది నుండి నాలుగు రోజుల పాటు జరుపుతామని అందులో బాగంగా మొదటి రోజు కాలభైరవ పాశుపత హోమాలు నిర్వహిస్తున్నామని రెండవ రోజు కోటిలింగేశ్వర స్వామివారికి పుష్పాబిషేకం బిళ్వాబిషేకం వుంటుంది మూడవ రోజు శ్రీజ్ఘానాంబికదేవికి పుష్పాబిషేకం నాలుగవ రోజు శివపార్వతుల కళ్యాణం వుంటుందని ఆలయప్రధానకార్యదర్శి రుమాళ్ళశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రుమాళ్ మహేశ్వర్ ఆలయ గౌరవాధ్యక్షులు బి.మల్లికార్జునయ్యస్వామి ఆలయప్రధానకార్యదర్శి రుమాళ్ళశేఖర్ ఆలయ అర్చకులు జగదీష్ స్వామి అనిల్ స్వామి మరియు కొత్తకోట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కరాటే శివ లు పాల్గొన్నారు.