జగిత్యాల మాస్టర్ ప్లాన్ G.O 238 రద్దు 

జగిత్యాల మాస్టర్ ప్లాన్ G.O 238 రద్దు 
  • కేంద్రం గైడ్ లైన్ ప్రకారమే మాస్టర్ ప్లాన్...
  • కొందరు కావాలని రైతులను రెచ్చ గోట్టారు...
  • ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ నూతన జగిత్యాల మాస్టర్ ప్లాన్ G.O 238 రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం  జీవో విడుదల చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో 14 జోన్లు 121 సర్వే నంబర్ లను జోన్ల మార్పు చేయటం జరిగిందని దాంతో ఇళ్ల అనుమతులు సులభం అయ్యాయన్నారు.కేంద్ర గైడ్ లైన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ జోన్ల ఏర్పాటుచేశారని,రాష్ట్రం లో 130 మున్సిపాలిటి లో సర్వే చేస్తే  జగిత్యాల 90శాతం పూర్తిగా నిండి పోయిందనీ ,టీ అర్ నగర్, లింగంపెట్, హస్నా భాధ్, తిప్పన్న పెట్ లను కలపడం జరిగిందన్నారు.కొందరు అధికారులు లోపం వల్ల రైతుల భూములు మాస్టర్ ప్లాన్లో వివిధ జోన్ రావడం జరిగిందని మాస్టర్ ప్లాన్ మున్సిపల్ తీర్మానించి నప్పుడు అన్ని పార్టీల కౌన్సిలర్ లు ఉన్నారని ,ప్రతి పక్ష నాయకులు రైతులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారన్నారు.Go 238 డ్రాఫ్ట్ ప్లాన్ లో సలహాలు సూచనలు చేయాలని మాత్రమే చెప్పడం జరిగింది అని ప్రజలకు ఇంకా ఏమైనా అపోహలు ఉంటే మాత్రం తొలగించు కోవాలని అన్నారు.మళ్ళీ రివ్యూ చేసిన తర్వాత,మున్సిపల్ గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటేనే ఆమోదం పొందడం జరుగుతుంది అని అన్నారు.

1996 లో కేంద్రం లో కాంగ్రెస్ అధికారం లో ఉన్నపుడే మాస్టర్ ప్లాన్ ముసాయిదా చేయటం జరిగిందని అన్నారు.జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ లేకనే అభివృద్ది కి దూరమైందని, స్కూల్, హాస్పిటల్ జోన్ లలో ఇండ్లు,రెసిడెన్షియల్ జోన్ లలో వ్యాపారాలు అనుమతులు ఎలా ఇచ్చారనీ,లే అవుట్ లేక ఇష్టానుసారంగ నిర్మాణాలు చేపట్టడం వల్లనే వర్షాలు వస్తె డ్రైనేజీ లు సరిపోని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ టిసి మహేష్, హెచ్ సి ఎ జిల్లా సభ్యుడు దావా సురేష్, సర్పంచులు గంగాధర్, లక్ష్మన్ రావు, ప్రభాకర్,
ఎంపీటీసీ మహేష్,మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం,నాయకులు మల్లారెడ్డి,సర్పంచులు,ఎంపీటీసీ లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.