రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలి - పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత

రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలి  - పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత

ముద్ర, లక్షేట్టిపేట్ : టీ పీ సీ సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ పిచ్చి కుక్క అని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద  అమెరికాలో రైతులకు ఉచిత విద్యుత్ గురించి రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిరసన, దిష్టి బొమ్మ దహనం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.... బీ ఆర్ ఎస్ రైతు సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే కాంగ్రెస్ నాయకులకు గిట్టడం లేదన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు విద్యుత్ లేకుండా చేసి రక్తపాతం సృటించాలనుకుంటున్న కాంగ్రెస్ ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. రేవంత్ పీసీసీ పదవిని డబ్బులతో కొనుకున్న పనికి రాని వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మెదడు లేని బండి సంజయ్ ను బీజేపీ బయటకు పంపినట్లు త్వరలోనే రేవంత్ ను కూడా కాంగ్రెస్ వదులుకుంటుందని  ఏద్దేవా చేశారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.... రైతులు బాగు పడటం కాంగ్రెస్ కు ఇష్టం లేదన్నారు.అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ.... కాంగ్రెస్ జాతీయ అధిష్టానం సూచనల మేరకే రేవంత్ రైతులపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.ఉచిత విద్యుత్ తో తెలంగాణ రైతులు పుష్కలంగా పంటలు పండించడం కాంగ్రెస్ నాయకులకు నిద్ర లేకుండా చేస్తుందన్నారు. రైతులకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు  విజిత్, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, రైతు సంఘం నాయకులు మోటపలుకుల గురువయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎమ్మెస్ శ్రీనివాస్ రెడ్డి,బీ ఆర్ ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండలధ్యక్షుడు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేష్,నాయకులు గంగాధర్, గణవేణి సుధాకర్, వేణు, చిప్పకుర్తి నారాయణ, సుమన్,తదితరులు పాల్గొన్నారు.