రేవంత్ రెడ్డి రైతులకు క్షేమపణ చెప్పాలి

రేవంత్ రెడ్డి రైతులకు క్షేమపణ చెప్పాలి
  • రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ
  •  రేవంత్ రెడ్డి ప్రకటన  సిగ్గుచేటు...
  • రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి
  • అమెరికా తానా సభల్లో  బయటపడ్డ కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి..
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కండించిన ..
  • జిల్లా రైతు బంధు కో ఆర్డినేటర్.. హింగే మహేందర్

తెలంగాణ రైతాంగానికి  ముఖ్య మంత్రి కేసీఆర్, భారత దేశం లో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నక్రమo లో రైతుల యొక్క సంపూర్ణ మద్దతు  ముఖ్య మంత్రి  కెసిఆర్ కి రావడాన్ని జీర్ణించుకోలేక ...పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడం సరికాదని అనడం సిగ్గు చేటని భూపాలపల్లి జిల్లా రైతు బంధు కో ఆర్డినేటర్ హింగే మహేందర్ క0డించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

కేవలం మూడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరి పోతుందని ఇచిత విద్యుత్ రైతులకు ఇవ్వకుండా రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన  రేవంత్ రెడ్డి,  రైతులకు కేవలం  మూడు గంటలు మాత్రమే ఉచిత విద్యుత్  ఇస్తే సరిపోతుందని  ఆయన మాట్లాడం సిగ్గుచేటు .. రైతుల పట్ల రేవంత్ రెడ్డి,   నీచ సంస్కృతి కి నిదర్శనం అని స్పష్టమవుతుంది. గతంలో నాణ్యమైన విద్యుత్ రైతులకు ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర గత ప్రభుత్వాల దని ,  రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ అయిన నాటి నుండే రైతుల పై విషం కక్కుతున్నారని  దీనికి గాను  కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రైతుల చేతుల్లో  తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.