భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. మూడో ప్రమాద హెచ్చరికల చేరువలో గోదావరి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పాటిల్ పేర్కొన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.